Monday, October 29, 2007

చిరుత సినిమా review

భారతదేశం లొ ఉన్న సవాలక్ష వెర్రి సంప్రదాయాల్లొ ఒకటి వంశపారంపర్యం. తండ్రి పైకి వస్తే ఇంక తప్పనిసరిగా కొడుకుల్ని, రెండు కాళ్ళ మీద నిలబడగల చుట్టాలు అందరిని పట్టుకువస్తాడు. అచ్చం కోతిలాగా ఉండే అల్లు అర్జున్ ని జనాలమీద రుద్దినా, చిరు కుటుంబానికి తెలుగు ప్రజల మీద కసి తీరలేదు. అల్లు అర్జున్ కన్నా ఇంకా వికారంగా ఉండే చిరు కొడుకుని జనాల మీదకి వదిలారు. ఈ latest hero వళ్ళు విరుచుకొని కొతిలాగ గెంతకలడు, fight master & special effects సాయంతొ కాస్త పోరాటాలు చెయగలడు. అంతే. ఒక మంచి గొంతు కాని, emotions కాని, dialogue delivery కాని ఏమి లెవు. సినిమా లొ ఒక కథ కాని, ఒక పధ్ధతి కాని ఏమి లేవు. కేవలం ఇతడి రకరకాల talents చూపించటానికి వీధి భాగవతం కన్న ఘోరంగా సన్నివేశలు అల్లారు. కాని విషాదం ఎమిటి అంటే ఈ hero కి అంత scene లేదు. పెద్దగా future ఉన్నట్టు కూడా కనపడదు. కాని చెప్పలేము. బాలకృష్ణ అంత చెత్త నటుడినే star గా నిలబెట్టిన పిచ్చి అభిమానులు ఉన్న రాష్త్రం మనది. తెలుగు ప్రజల ఖర్మ కాలితే ఇతను కూడ పెద్ద hero అవుతాదు. ఇక సినిమా విషయానికి వస్తే, చాలా చెత్త సినిమా. నేను ఒక గంట లొనే లేచి వచ్చేసాను. తరవాత ఎమి జరిగిందో తెలియదు, తెలుసుకొవాలని ఆసక్తి కూడా లేదు. నేను చూసిన గంటలొ ఏమి జరిగిందో నాకు అర్ధం కాలేదు. ఈ సినిమా enjoy చేయలంటే, మీరు పిచ్చిపట్టిన పిచ్చి చిరు అభిమాని అవ్వాలి, లేకొపోతే మానసిక వ్యాధి ఉండాలి. మీరు ఈ రెండు కాకపోతే, ఈ సినిమా చూడొద్దు.


ఈ face కూడా hero ఐతే, ఇక ఎవరైనా hero అవ్వచ్చు. కాగితాలు ఏరుకొనే వాళ్ళు కూడా.




ఇది నరాల బలహీనత వ్యాధి ఉన్న మనిషి కష్టపదుతున్నాట్టు ఉందికాని, అస్సలు dance లాగా లేదు. దీన్ని కూడా dance అంటారా ?




వీళ్ళ ఇద్దరిలో ఎవరు వికారంగా ఉంటారు అని చెప్పటం చాల కష్టం.

6 comments:

oremuna said...

May God Bless This Blog.

abhay said...

మన భారతీయుల దౌర్భ్యాగ్యం కొద్ది చలన చిత్ర పరిశ్రమలొ వారసుల పరంపర నడుస్తోంది.ప్రతీ నటుడు తాను సంపాదించిన దానితో సంతృప్తి చెందక, ప్రేక్షకులను హింసించినది చాలక తన పుత్రరత్నాలను కూడా మన మీదకు వదులుతున్నారు. ఇప్పటి తరం నటులనైతే అసలు చూడలేకపోతున్నాం.చూడడానికి ఎంత అసహ్యంగా వుంటారో యాక్టింగ్, డైలాగ్ డెలివరి మరింత అసహ్యం గా వుంటున్నాయి.గ్రాఫిక్స్ సహాయంతో బాగా నటిస్తున్నామని నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు. తండ్రుల అభిమానులందరూ మూఢ అభిమానంతో వారి కొడుకుల వర్త్ తెలుసుకోకుండా నానా హంగామా చేస్తూ ఇమేజ్ తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నారు.ఈ రొజున కామెడీ యాక్టర్లు కూడా తమ పుత్ర రత్నాలను ఫీల్డ్ లొనికి దింపాలని ప్రయత్నిస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగ జారిపోతోందొ ఇట్టే ఊహించుకోవచ్చు.అసలు మార్పు మనలొనే ముందుగా రావాలి.ఇలాంటి కొతి మూక నటులను తరిమి కొట్టాలి.ఇలాంటి నటుల వలనే భారతీయ సినిమా తన ఉనికిని కొల్పోతున్నది. మరేదేశంలొనూ ఇటువంటి వారసత్వ పరంపర లేదు.

కొత్త పాళీ said...

మీరు నిజాయితీగా రాయడం ముదావహమే.
అల్లు అర్జున్ని నేను నేరుగా చూశాను. చూడ్డానికి కుర్రాడు బావుంటాడు సినిమాల్లో కంటే.

KishyCool said...

@Oremuna, thank u very much.

@Abhay, u said it very correctly. చాలా బాగ చెప్పారు. కళ ని డబ్బు కొనెస్తే వచ్చే ఫలితాలు ఇలాగే ఉంతాయి.

@ కొత్త పాళీ, ధన్యవాదాలు. ఈ heroes తో నాకు వ్యక్తిగతంగా ద్వేషం ఏమీ లేదు. నా బాధల్లా వీళ్ళని బలవంతంగా జనాల మీద రుద్దటం.

srilu said...

nEnu allu arjun ni amsterdam airport lO chooSaanu. black pant, black shirt kaLLaki cooling glass peTTukoni chaalaa baagunnaaDu. kaanee kaasta nallagaa unnaTTanipinchaaDu :)

Hari said...

evarina natana choodali kani andham mukyamkadu