Tuesday, October 30, 2007

అతిథి సినిమా review

ఒక మనిషిలొ ఉన్న బలం అంతా అతను విజయాన్ని అందుకొవటం చెసే కృషి లొ బయటకు వస్తుంది. ఒకసారి విజయాన్ని అందుకొన్నాక, ఇక బలహీనతలు బయటకి రావటం మొదలుపెడతాయి. కొత్త విజయాలు సాధించటంకంటే, సాధించిన విజయాన్ని ఎలా నిలుపుకోవాలనే తపన ఎక్కువ అవుతుంది. దానితో, ఉన్న విజయం కుడా చేజారిపోతుంది. దీనికి best example మహేష్ బాబు. ఇతను సాధించిన విజయాలు అన్ని ఒక కొత్తరకమైన సినిమాలు చేయతం వల్ల వచ్చాయి. ఒక్కడు, అతడు, పోకిరి సినిమాలు ఒక రకమైన కొత్త సినిమాని తెలుగు వాళ్ళకి చూపించాయి. ఆ తరవాతనించి మహేష్ కి విజయాన్ని ఎలా నిలుపుకొవాలనే భయం పట్టుకొంది. దానితో ఇక ప్రయోగాలు చేయటం మానెశాదు. మళ్ళా పాత చింతకయ పచ్చడి సినిమాలు తీయటం మొదలుపెట్టాడు. ఫలితంగా సైనికుడు లాంటి చెత్త సినిమా, ఇప్పుడు అతిథి లాంటి చప్పటి సినిమా. కథలొ ఎలాంటి కొత్తదనం లేదు. పాత్రల్లొ కూడ ఏమి గొప్పతనం లేదు. బాగున్నదల్లా camera work, fights, రెండు పాటలు, అంతే. ముంబైనినించి వచ్చిన అమృత రావ్ అంతా బాగలేదు. ఆమెని ఎందుకు తీసుకొన్నారొ అర్థం కాలెదు. అంతకంటే అందమైన heroine దొరకలెదా ? రకరకాల మసాలాలు వేసి వండినా, అన్నం సరిగ్గా వండకపొతే ఏమి తినలేము. ఈ సినిమా కూడా అంతే. అదనపు హంగులు బాగానే ఉన్నాయి కాని అసలు విషయమైన కథ ఏమి లేదు. సంభాషణలు (dialogues) 1970 లొ తీసిన NTR సెంటిమెంటు సినిమా లొ ఉన్నాయి. సినిమా లొ అనుకోని మలుపులు కాని, అద్భుతం అనిపించే సంఘటనలు కాని ఎమి లేవు. కేవలం మహేష్ బాబు అభిమానులని దృష్టిలొపెట్టుకొని తీసిన సినిమా. గడచిన తరం లొ చిరంజీవి ఇలా image కి బలి అయ్యాడు. ఎంతో talent ఉంచుకొని కూడా ఒక గుర్తుపెట్టుకొనే సినిమా ఎమి చేయలేకపోయాడు. చూస్తుంటే, ఇప్పుడు మహేష్ బాబు కూడా అదే దోవ లొ వెళ్తున్న్నట్టు ఉంది.
మహేష్ బాబు కి ఒక సలహా: కొత్తరకం గా సినిమా తీస్తే అది ఫ్లాప్ అవ్వొచ్చు, లేకపోతే హిట్ అవ్వొచ్చు. కానీ, ఇలా పాత చింతకాయ పచ్చడి లాగా సినిమా తీస్తే ఖచ్చితంగా ఫ్లాప్ అవుతుంది. అభిమానులు కూడా దూరం అవుతారు. అభిమానులకోసం కాకుండా, నీకు నచ్చిన మంచి సినిమ తీయి బాబు. లేకపొతే ఇంక అంతే.

1 comments:

Hari said...

mahesh natana chala bagunnadi